The Desk … Eluru : ఇంటెల్లి కిడ్జ్ స్కూల్లో సైన్స్ ఫెయిర్‌

The Desk … Eluru : ఇంటెల్లి కిడ్జ్ స్కూల్లో సైన్స్ ఫెయిర్‌

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు తంగెళ్ళమూడిలో ఉన్న ఇంటెల్లి కిడ్జ్ స్కూల్లో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శన విశేష స్పందన లభించింది. పాఠశాల యాజమాన్యం “రిహాజా 2k26” ధీమ్ తో స్కూల్ క్యాంపస్లో సైన్స్ ఫెయిర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు చేపట్టిన 200 పైచిలుకు ఛార్టులు, ప్రాజెక్టులు నమూనాలు పలువురిని ఆకర్షించాయి.

స్మార్ట్ సిటీ, భూకంప సెన్సార్, ప్రజాస్వామ్యం, రాష్ట్రాల రాజధానులు, ప్రాథమిక హక్కులు, నీటి చక్రంభౌతిక శాస్త్ర, రసాయన శాస్త్ర ప్రయోగాలు, గణిత ఆవిష్కరణలు, ఇస్లామిక్ చరిత్ర, మసీదు నమూనాలు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో సిద్ధం చేసి వాటి గురించి పిల్లలు వివరించడం ఆకర్షణగా నిలిచింది.

సందర్భంగా ప్రిన్సిపాల్- ఎండీ. తబస్సమ్ మాట్లాడుతూ..

విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయన్నారు. పోటీ ప్రపంచంలో ధీటుగా ఎదుర్కునేందుకు , పిల్లల్లో శాస్త్ర దృక్పథం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్- ఎండీ. కరీమా, సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

Intelli Kidz School Hosts Vibrant Science Fair

Intelli Kidz School in Tangedlamudi, Eluru, organized a resounding science fair under the theme “Rihaja 2k26,” drawing enthusiastic participation from students and visitors alike. Over 200 charts, projects, and models captivated the audience, showcasing topics like smart cities, earthquake sensors, democracy, state capitals, fundamental rights, water cycle, physics and chemistry experiments, math inventions, Islamic history, and mosque replicas. Prepared under teachers’ and parents’ guidance, students confidently explained their works.

Principal MD. Tabassum emphasized that such fairs foster scientific temperament, equipping children to face a competitive world boldly. Incharge MD. Kareema and staff attended.