🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
విద్య వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి కోసం ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన నూతన అంబులెన్స్ ను శనివారం అందుబాటులోకి తీసుకు వచ్చారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా కొత్త అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. అనంతరం శివగోపాల్ లూనాని ఆడిటోరియంలో ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తో కలిసి ఎంపీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ…
జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగా ఇప్పటికే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి కోటి రూపాయలతో ఆధునిక పరికరాలను అందజేశామని అన్నారు. తాజాగా 30 లక్షలు ఎంపీ లాడ్స్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త అంబులెన్స్ సమకూర్చటం జరిగిందన్నారు. ఆక్సిజన్ సౌకర్యంతో సహా అంబులెన్స్ లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు వెచ్చించి కావలసిన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించినట్లు చెప్పారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలకంటే అభివృద్ధికి, విద్యకు, వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ కాలేజీలు, నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ లాబ్స్ ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించామని ప్రకటించారు.
Education and Healthcare Given Priority : MP Putta Mahesh Kumar
MP Putta Mahesh Kumar said that the coalition government is giving priority to education and healthcare. On Saturday, he inaugurated a new ambulance purchased with MP funds for the Eluru Government Hospital. The new ambulance services were launched by District In-charge Minister Nadendla Manohar. Later, the MP, along with local MLA Badeti Radhakrishnaiah, inaugurated a free medical camp at the Shivagopal Lunani Auditorium. On this occasion, MP Putta Mahesh Kumar said that they are striving to provide better medical services to the people of the district, and as part of this, they have already provided modern equipment worth one crore rupees to the Eluru Government Hospital. He said that a new ambulance has been provided to the government hospital with MP LAD funds of 30 lakhs. He stated that the ambulance is equipped with all facilities, including oxygen, and that he has instructed that more funds be allocated if necessary to provide the required medical facilities. He said that after the coalition government came to power, they are giving priority to development, education, and medical services over politics. As part of this, he announced that the program to set up AI labs in 7 government colleges and four government schools within the Eluru parliamentary constituency has been initiated.

