🔴 ఏలూరు జిల్లా : ఆశ్రo కాలేజ్ ఆస్పత్రి :
ఆశ్రమం చాలెంజర్ ట్రోఫీ దివ్యాంగుల క్రికెట్ విజేతగా ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించింది. ట్రోఫీ విజేతకు 50వేల రూపాయలు నగదు ట్రోఫీతో ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా మూడు రోజుల దివ్యాంగుల క్రికెట్ లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహక నగదుతో పాటు ప్రశంస పత్రంతో సత్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా డిఎస్డివో అజీజ్ మాట్లాడుతూ..
దివ్యాంగుల క్రికెట్ క్రీడను ప్రోత్సహించే విధంగా అన్ని చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు, గుప్తా ఫౌండేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎన్ ఫౌండేషన్ అధినేత నారా శేషు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత మెన్ అండ్ ఉమెన్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ రెడ్డి, మదన్ కి ఏమి ఇచ్చారు ఏలూరు జిల్లాలో క్రికెట్ అకాడమీ సెక్రటరీ మదన్ లు పాల్గొన్నారు.

