🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు నగర ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే పవర్ పేట రైల్వేగేటు వద్ద నిర్మించే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికా బద్దంగా ముందుకు సాగితే అనుకున్న ప్రయోజనాలు పొందవచ్చునని ఏలూరు ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పేర్కొన్నారు.
ఏలూరు పవర్ పేట రైల్వేగేటు వద్ద ఆర్వోబి నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ ఖరారు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలనను గురువారం నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసి విజయవాడ జోన్ – 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్‌తో పాటూ వివిధ శాఖల అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలన జరిపారు. పవర్ పేట స్టేషన్ ప్రాంతంలోని రైల్వేగేటు మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి.
అయితే ఇటుగా రైళ్ళు వెళ్ళిన సమయంలో గేటు మూసివేయడం, తిరిగి తెరిచేంత వరకూ వాహనాలు బారులు తీరడం వెరసి అక్కడ ట్రాఫిక్ సమస్య పెద్ద తలనొప్పిగానే మారింది. ఎన్నో ఏళ్ళుగా ఈ సమస్య పరిష్కారానికి ఎంతో మంది ప్రజాప్రతినిధులు కృషిచేస్తామని చెప్పారే తప్ప…తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. దీంతో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి ప్రాథమిక అనుమతులు లభించడంతో డిపిఆర్ సిద్ధంచేసే పనిలో అధికారులు ముందడుగు వేశారు.
దీనిలో భాగంగానే గురువారం ఆ ప్రాంతంలో పర్యటించి ఎక్కడ వరకూ ఆర్వోబి నిర్మిస్తారు, సర్వీసు రోడ్లు ఏ పక్కన వస్తాయి తదితర అంశాలను పరిశీలించారు. కొన్నిచోట్ల మార్కింగ్‌లు కూడా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి రైల్వే అధికారులను అడిగి పలు విషయాలను తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయోగకరమైన ఈ ఆర్వోబి నిర్మాణం విషయంలో అన్నిశాఖల అధికారులు చురుగ్గా వ్యవహరించాలని సాధ్యమైనంత వరకు గేటు పరిసర ప్రాంత నివాసులకు నష్టం జరగకుండా చూడాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్, తహశీల్దార్ గాయత్రీ దేవి, రైల్వే, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
Planned Approach Key to Railway Overbridge Success in Eluru
Coordinated, planned efforts by all departments can deliver the long-awaited benefits for Eluru residents at the Power Pet railway gate, said Eluru MLA and TDP district president Badeti Chanti.
On Thursday, MLA Chanti, along with RTC Vijayawada Zone-2 Chairman Reddy Appalanayudu and Eda Chairman Peddiboyina Shivaprasad, conducted a field inspection for the Detailed Project Report (DPR) of the proposed Railway Overbridge (ROB). Officials from various departments joined to assess the site, marking alignments and service roads.
Daily, thousands of vehicles cross the Power Pet gate, but train passages cause lengthy closures and severe traffic jams—a persistent headache unsolved despite past promises. With initial approvals secured, officials are advancing DPR preparation.
Chanti urged railway officials for swift action, emphasizing minimal disruption to nearby residents. “All departments must work seamlessly to achieve anticipated gains,” he stressed.
Participants included Eluru RDO Achyuta Ambarish, Tahsildar Gayatri Devi, and officials from railways, R&B, revenue, and corporation.

