🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
ఏపీ రైల్వే ప్రాజెక్టులపై లోక్ సభలో ఏలూరు ఎంపీ ప్రశ్న.
2025-26లో తెలుగు రాష్ట్రాల్లో 9,417 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు.
ఏపీకి భారీగా నిధులు కేటాయిస్తున్నామన్న కేంద్ర రైల్వే మంత్రి.

ఏపీ లోని రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు గతంతో పోల్చితే భారీగా పెరిగిందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు బుధవారం లోక్ సభలో రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. 3,796 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం- కొవ్వూరు (119 కి.మీ) రైల్వే లైన్ ప్రాజెక్టుకు గతంలోనే అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్న కేంద్ర మంత్రి, ఇందులో భద్రాచలం- సత్తుపల్లి (56 కి.మీ) మధ్య పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన దూరానికి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో 9,417 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసామని చెప్పిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, 2019-14 మధ్య మంజూరు చేసిన (886 కోట్లు) తో పోల్చితే, ఇది పది రెట్లు ఎక్కువ అని వివరించారు.
ఏపీలో 2014 -25 మధ్య కాలంలో 1,582 కిలోమీటర్ల కొత్త ట్రాక్ పనులు పూర్తయ్యాయని రైల్వే మంత్రి తెలిపారు. 2025 ఏప్రిల్ 1 నాటికి మొత్తంగా 70,232 కోట్ల విలువైన మొత్తం 39 ప్రాజెక్టులు (4,499 కిలోమీటర్ల) ఏపీకి మంజూరు చేయడం జరిగిందని ఇందులో 12 కొత్త లైన్లు, 27 డబ్లింగ్ పనులు ఉన్నాయని మంత్రి వివరించారు. వీటిలో విజయవాడ -గుడివాడ -నరసాపురం, విజయవాడ -గుడివాడ- మచిలీపట్నం, భీమవరం- నిడదవోలు డబ్లింగ్ పనులు, గుంటూరు -తెనాలి పనులు, నంద్యాల- ఎర్రగుంట్ల కొత్త లైన్, జగ్గయ్యపేట మేళ్లచెరువు, ఓబులవారిపల్లె – కృష్ణపట్నం కొత్త రైలు మార్గం, విజయనగరం – కొత్తవలస 3వ లైన్, రాయచూర్ -గుంతకల్ డబ్లింగ్ పనులు, గుంతకల్లు- కల్లూరు డబ్లింగ్ పనులు, ఎలహంక -పెనుగొండ డబ్లింగ్ పనులు, గుత్తి -ధర్మవరం డబ్లింగ్ పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.
కోటిపల్లి- నర్సాపూర్ కొత్త లైన్, నడికుడి- శ్రీకాళహస్తి కొత్త లైన్, విజయవాడ -గూడూరు మూడో లైన్, గుంతకల్లు- గుంటూరు డబ్లింగ్, పెనుగొండ -ధర్మవరం డబ్లింగ్, గుత్తి -పెండేకల్లు డబ్లింగ్, గూడూరు -రేణిగుంట మూడో లైన్ పనులు సహా 16 పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన మరో అనుబంధ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025 -26) లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 65 సర్వేలు (6,985 కి.మీ) చేపట్టామని, ఇందులో 15 కొత్త లైన్లకి సంబంధించివి కాగా, డబ్లింగ్ పనులకు సంబంధించి 50 పనులు చేపట్టడం జరిగిందని రైల్వే మంత్రి తెలిపారు.
భూసేకరణ సమస్యలు, ఫారెస్ట్ క్లియరెన్స్, వివిధ శాఖల నుండి చట్టబద్ధమైన అనుమతులు, భౌగోళిక పరిస్థితుల కారణాలవల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్రమంత్రి తెలియచేశారు. ఈ సందర్భంగా భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్ త్వరగా చేపట్టాల్సిన అవసరాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
లోకేష్ తో ఎంపీ పుట్టా భేటీ
ఢిల్లీ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ టీడీపీ ఎంపీలతో సమావేశయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రమంత్రులను కలిసి చర్చించాల్సిన అంశాలు, రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు, నిధుల గురించి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా నారా లోకేష్ తో ప్రత్యేకంగా సమావేశమైన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్, నేవీ డిపో సహా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు ఎంపీ కార్యాలయం తెలియచేసింది.
MP Putta Mahesh met with Lokesh.
State IT and Education Minister Nara Lokesh, who is on a visit to Delhi, met with TDP MPs. This meeting, held at the residence of Union Minister Pemmasani Chandrasekhar in Delhi, was attended by several MPs, including Eluru MP Shri Putta Mahesh Kumar. Discussions were held regarding the issues to be raised in the Parliament sessions as per Chief Minister Chandrababu’s instructions, matters to be discussed with Union Ministers regarding state projects, and budget allocations and funds for the state. On this occasion, MP Putta Mahesh Kumar met separately with Nara Lokesh and discussed several pending projects related to the Eluru parliamentary constituency, including the Bhadrachalam-Kovvur railway line and the Navy depot, according to the MP’s office.

