పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఏలూరు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులతో అర్హులైన ప్రతీ ఒక్కరికీ అక్రిడిటేషన్ మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ జీవో నం 84 నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇంకనూ అర్హత ఉన్న పాత్రికేయులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి మరియు వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి రెండవ సమావేశం లో అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
త్వరలోనే ఆమోదం తెలిపిన అప్లికేషన్లు మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా పాత్రికేయులు సమాజానికి ప్రభుత్వానికి వారిదిగా ఉంటూ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువుగా తీసుకెళ్లే విధంగా సమాచార శాఖతో పాటు పాత్రికేయులు కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించగా, పరిశీలించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు బి.కె. కిషోర్, కె. శంకరరావు, వి. విద్యాసాగర్, ఎం. శ్రీనివాసరావు, డి. వెంకటరమణ, ఎస్. శాంతకుమార్, ఎన్ . ఈశ్వర్, కె.ఎన్ .వి. శివసాగర్, జి. రఘురామ్, ఎస్. సంజయ్ కుమార్, ఎం. పగడం కళ్యాణ్, ఐ. వి.వి. ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. అమృతం, కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ జి. సత్యనారాయణ, పోలీసు అధికారి కె. కేశవరావు, ప్రభృతులు పాల్గొన్నారు.
(జిల్లా సమాచార శాఖ, ఏలూరు జిల్లా, ఏలూరు వారిచే జారీ చేయబడినది)

