🔴 ఏలూరు జిల్లా : ఏలూరు :
వైసిపి పార్టీ అంటేనే బూతుల పార్టీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి నిరూపించారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఎద్దేవా చేశారు. పరిపాలనాదక్షుడు, 40ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తల్లిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసిపి నేత అంబటి రాంబాబును తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏలూరులో శనివారం ఆయన ఒక ప్రకటన చేస్తూ అంబటి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి గానీ అవి శృతిమించితే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయని అంబటి వంటి వ్యక్తులకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఇటువంటి బూతులు మాట్లాడే నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే మిగతా నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతారని బడేటి చంటి పేర్కొన్నారు. తన పాలనతో ఎంతో మంది ప్రపంచాధినేతల ప్రశంసలు పొందిన చంద్రబాబును ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బూతులు తిట్టి అదేదో గొప్పగా భావించడం వైసిపి పార్టీ సంస్కృతిగా మారిపోయిందని ఆయన విమర్శించారు. ఇటువంటి వ్యక్తులను, వారి వెనుకఉండి నడిపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే మరో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.
Eluru MLA Baddeti Chanti demanded the immediate arrest of YSRCP leader Ambati Rambabu
TDP district president and Eluru MLA Baddeti Chanti demanded the immediate arrest of YSRCP leader Ambati Rambabu for his vulgar remarks against Chief Minister N. Chandrababu Naidu and his late mother.
In a statement here on Saturday, Chanti condemned Ambati’s “boothu” (abusive) comments, calling YSRCP the “boothu party.” “Criticism is fine, but crossing limits invites strict punishment. Legal action against such leaders will discipline others,” he said, slamming the remarks as shameful for civilized society.
Chanti warned that people are watching Jagan’s puppets, vowing a “lesson soon.” Naidu’s global acclaim deserves respect, he added.

