🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
PMKSY కింద గత ఐదేళ్లలో ఏపీకి భారీగా నిధులు.
3,05,279 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు.
ఏలూరు జిల్లాలో 15,017 హెక్టారల్లో మైక్రో ఇరిగేషన్.
పథకం అమలుపై ఆడిట్ నిర్వహించని వైసీపీ ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన (PMKSY), దానికి సంబంధించిన వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కాంపోనెంట్ (WDC) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 946.42 ఇచ్చినట్లు కేంద్ర జల్ శక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా PMKSY పథకం అమలు తీరుపై గురువారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి.
ఈ పథకం కింద గత ఐదేళ్లలో ఏపీలో మొత్తం 26 జిల్లాల పరిధిలో 3,05,279 హెక్టార్ల భూమి సూక్ష్మ నీటిపారుదల కింద సాగులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇందులో ఏలూరు జిల్లాలో 15,017 హెక్టారల్లో మైక్రో ఇరిగేషన్ అమలు చేశారు. అంతేకాకుండా WDC-PMKSY పథకంలో భాగంగా గత ఐదేళ్లలో ఏపీలోని 13 జిల్లాల్లో 59 వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల కోసం 380.76 కోట్ల నిధులు కేంద్రం విడుదల చేసింది.
ఈ ఫథకం వల్ల ప్రత్యక్షంగా 61,776 మంది రైతులు/రైతు సంఘాలు లబ్ది పొందినట్లు ఏలూరు ఎంపీకి ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వివరించారు. PMKSY లోని మూడు భాగాలు అయిన AIBP, CADWM & SMI-RRR కింద ప్రాజెక్టులను కేంద్ర జల సంఘం (CWC) క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని చెప్పిన కేంద్ర మంత్రి, ఈ పథకం యొక్క ఆడిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లోని గత ప్రభుత్వం ఈ ఆడిట్ ను నిర్వహించలేదని వెల్లడించారు.

