🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా ఏలూరు పార్లమెంటు పరిధిలోని కూటమి నాయకులంతా కలిసి పనిచేస్తున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఆదివారం దెందులూరు నియోజకవర్గం జాలిపూడి గ్రామంలో వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, మైక్రో ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సేవ పట్ల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిత్తశుద్ధి చూసి తన వంటి యువ నాయకులు ఎంతో నేర్చుకుంటున్నామన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ ఉపయోగపడే విధంగా, గ్రామాల అభివృద్దే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ముందుగా జాలిపూడి గ్రామానికి చేరుకున్న ఎంపీకి ఎమ్మెల్యే చింతమనేని, గ్రామ, మండల పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా 51 లక్షల వ్యయంతో జలజీవన్ మిషన్ కింద జాలిపూడి గ్రామంలో నిర్మించే వాటర్ ట్యాంక్ కి శంకుస్థాపన, 8 లక్షల వ్యయంతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ ప్లాంట్ కు ఎంపీ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అదే గ్రామంలో 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే వెలమపేట మల్టీ పర్పస్ హాల్ కు ఎంపీ భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ..
ఎంపీ లాడ్స్ కింద గత ఏడాదిగా అనుమతులు ఇచ్చి, శంకుస్థాపన చేసిన పనులన్నీ త్వరిత గతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దెందులూరు నియోజక వర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులకైనా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ..గ్రామాలలో అన్ని కులాలు, వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కష్టపడుతున్నామన్నారు.

