The Desk… Eluru  : ‎ప్రజలు సంతోషంగా ఉంటే వైసీపీ తట్టుకోలేకపోతోంది : ఏలూరు ఎంపీ మహేష్

The Desk… Eluru : ‎ప్రజలు సంతోషంగా ఉంటే వైసీపీ తట్టుకోలేకపోతోంది : ఏలూరు ఎంపీ మహేష్

ప్రజలు పండుగ చేసుకున్నా వైసీపీకి కడుపుమంటగానే ఉంది.

తిరుమలలో మద్యం సీసాలు వేయటం ఆ పార్టీ కుట్రల సంస్కృతికి నిదర్శనం.

ఇటువంటి కుళ్ళు రాజకీయాలతోనే 11 సీట్లకు పరిమితమయ్యారు.
‎➖సంక్రాంతి సంబరాల్లో ఏలూరు ఎంపీ.

ఏలూరు జిల్లా : ది డెస్క్ :

గోపాలపురం నియోజకవర్గం వేళ్ళ చింతలగూడెం, నూజివీడు నియోజకవర్గం మీర్జాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు  వేళ్ళ చింతలగూడెం చేరుకున్న ఎంపీ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో ఎంపీ మాట్లాడారు. రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో ఉంటే వైసీపీ పార్టీ మాత్రం కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ముఖ్యంగా పవిత్రమైన తిరుమలపై వైసీపీ నీచ రాజకీయాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వైసీపీ నేతలు, వారి సాక్షి మీడియా కలిసి ఖాళీ మద్యం సీసాలు తెచ్చి కొండపై పడేసి, ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనాలను ప్రభుత్వం, టీటీడీ కలిసి అత్యంత కట్టుదిట్టంగా, భక్తులకు సౌకర్యంగా అద్భుతంగా నిర్వహించారనీ, దీన్ని తట్టుకోలేకపోయిన  వైసిపి నేతలు మద్యం సీసాలు వేసి తిరుమలను అపవిత్రం చేసే కుట్రకు తెరతీసారన్నారు. 

అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో దోపిడీలు చేశారని, కల్తీ నెయ్యి సరఫరా చేసి కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసారన్నారు. పరకామణి దొంగలతో కుమ్మక్కయి దేవుడికే నామం పెట్టారని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ములేని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తిరుమల వంటి పుణ్యక్షేత్రాన్ని వాడుకోవటాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

మధ్యాహ్నం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఏర్పాటు చేసిన పశువుల ప్రదర్శనను, పాడి ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించి, ఉత్తమ పశువుల పెంపకదారులకు మంత్రితో కలిసి బహుమతులను అందజేశారు. విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు మంత్రి, ఎంపీలకు పశు ప్రదర్శన వివరాలను తెలియ చేశారు.