The Desk … Eluru : ‎‎పోలవరంతో పాటు చింతలపూడి పనులు కూడా వేగవంతం చేస్తాం :

The Desk … Eluru : ‎‎పోలవరంతో పాటు చింతలపూడి పనులు కూడా వేగవంతం చేస్తాం :

  • పోలవరం పనులు 2027 జూన్ కి పూర్తి.‎
  • చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరలో ప్రారంభం.
  • నేవీ ఆయుధ డిపో కొయ్యలగూడెంకి మార్పు
  • ➖‎ MP (మహేష్ పుట్టా)

ఏలూరు జిల్లా : పోలవరం : ది డెస్క్ :

పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు కంపెనీని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం ముఖ్యమంత్రితో పాటు పోలవరం ప్రాజెక్టు సందర్శనలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. పర్యటన ఆసాంతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నడుస్తూ పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.

అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్టు కంపెనీ హామీ ఇచ్చిందన్నారు. కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ  పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

ఈ సందర్భంగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను కూడా త్వరలో ప్రారంభించాలని మేఘా ఇంజనీరింగ్ సంస్థను ముఖ్యమంత్రి ఆదేశించారని ఎంపీ తెలిపారు. అదేవిధంగా నేవీ ఆయుధ డిపో ఏర్పాటు కోసం కొయ్యలగూడెం వద్ద స్థల సేకరణ కోసం త్వరలో ప్రజాభిప్రాయసేకరణ చేపడుతున్నట్లు స్పష్టం చేసిన ఎంపీ, ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతతో ఏలూరు జిల్లాకు అన్నీ మంచి రోజులు రానున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.