- ప్రతి మండలం, ప్రతి గ్రామం సందర్శించనున్న ఎంపీ.
- ఇటీవల టీడీపీపీ సమావేశంలో ముఖ్యమంత్రి సూచనతో వెంటనే కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఎంపీ.
- ఏడాది పొడవునా నిరంతరాయంగా కొనసాగనున్న మన ఊరు మన ఎంపీ కార్యక్రమం.
- ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే మంచి ప్రయత్నం.
ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడే విధంగా మంగళవారం నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ఈమేరకు మీడియాకి ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 27న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఎంపీలు కూడా గ్రామాలలో పర్యటించాలని సూచించారని చెప్పిన ఎంపీ, ముఖ్యమంత్రి సూచనల మేరకు పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో ప్రతి నెల కొన్ని రోజులు ఏలూరు పార్లమెంట్ పరిధిలో అన్ని మండలాలు, గ్రామాలు పర్యటించే విధంగా ప్రత్యేక కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ఈ కార్యక్రమానికి “మన పల్లెకు మన ఎంపీ” అనే పేరు నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా మంగళవారం ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి భేటీ కానున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన ప్రకటనలో తెలియచేశారు.
Our Village – Our MP
Eluru MP’s Special Program.
The MP will visit every mandal and every village.
The MP immediately designed the program following the Chief Minister’s suggestion at the recent TDPP meeting.
The “Our Village, Our MP” program will continue uninterrupted throughout the year.
A commendable effort to explain government welfare programs and understand people’s problems.
Eluru MP Putta Mahesh Kumar announced that he is undertaking a special program from Tuesday to visit every mandal and every village within the Eluru parliamentary constituency and interact directly with the people. The MP released a statement to the media in this regard. The MP said that Chief Minister Chandrababu, speaking at the Telugu Desam Parliamentary Party (TDPP) meeting held at the party office in Mangalagiri on November 27, suggested that MPs should also visit the villages after the conclusion of the Parliament sessions. Following the Chief Minister’s suggestions, the MP stated that he has designed a special program to visit all the mandals and villages within the Eluru parliamentary constituency for a few days every month when Parliament is not in session. This program, which aims to explain government welfare programs and understand people’s problems, has been named “Our Village, Our MP”. As part of this, the MP Putta Mahesh Kumar stated in his statement that he will first visit Musunuru village in Musunuru mandal on Tuesday and meet with the people directly

