🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగముగా… ఈరోజు ఏలూరు ఉప రవాణా కమిషనరు కార్యాలయములో ఇంఛార్జి ఆర్టీవో ఎస్.బి.శేఖర్ ఆధ్వర్యములో నగరంలోని వాహన డీలర్లతో రహదారి భద్రతా నియమాలపై అవగాహనా కార్యక్రమo నిర్వహించారు.
ఈ సందర్భముగా ఎస్.బి.శేఖర్ మాట్లాడుతూ..
ఈ మాసములో రవాణాశాఖ నిర్వహించబోయే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని అదేవిధముగా వాహనాలు విక్రయించే సమయములో కొనుగోలుదారులకు సీటు బెల్టు ధరించడం మరియు హెల్మెట్ ధరించడం తదితర రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమములో మోటారు వాహన తనిఖీ అధికారులు పాల్గొన్నారు.

