The desk…Eluru : మోదెల గ్రామానికి సౌర విద్యుత్ వెలుగులు

The desk…Eluru : మోదెల గ్రామానికి సౌర విద్యుత్ వెలుగులు

  • శతాబ్ద కాలంగా విద్యుత్ కోసం ఎదురుచూస్తున్న గిరిజనుల కల నెరవేరిన రోజు
  • జిల్లా అధికారులను కృతజ్ఞతా పూర్వకంగా కలిసిన మోదెల గ్రామస్తులు

ఏలూరు జిల్లా : కలెక్టర్ కార్యాలయo : ది డెస్క్ :

శతాబ్ద కాలంగా విద్యుత్ వెలుగులకు నోచుకోని గిరిజన గ్రామం ‘మోదెల’. తమ గ్రామంలో విద్యుత్, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరితే, కొండదిగి రమ్మంటున్నారని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ కు వినతిపత్రం పంపుతూ..తమ చిన్న గిరిజన గ్రామంలో కనీసం విద్యుత్ సౌకర్యం లేదని, రహదారులు లేవని కనీస వసతులు కల్పించాలని కోరారు. ఈ విషయంపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ స్వయంగా ఆ గ్రామంలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

వీటిపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్వయంగా అధికారులతో సమీక్షించి, ఆ గ్రామంలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ముందుగా గ్రామంలోని 23 ఇళ్లకు విద్యుత్ అందించేందుకు 12. 5 లక్షల రూపాయలతో 5 KWA గ్రిడ్ ను ఏర్పాటుచేసి ప్రతీ ఇంటికీ సౌర విద్యుత్ ను అందించారు. తమకు విద్యుత్ వెలుగులు అందించిన జిల్లా యంత్రాంగాన్ని కలిసి తమ కృతఙ్ఞతలు తెలియజేసేందుకు మోదెల గ్రామస్తులు సోమవారం ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలుకు విచ్చేసారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ను, విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాల్మన్ రాజును శాలువా, పూల మొక్కతో ఘనంగా సన్మానించి, తమ కృతజ్ఞతలను తెలియజేసారు.