🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరులోని పలు చర్చిలకు లకు ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్ క్రిస్మస్ పండుగ రోజున కేక్ లు పంపారు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షల సందేశాన్ని పంపారు.
ఎంపీ ఆదేశాల మేరకు కార్యాలయ ప్రతినిధులు ఆయా చర్చి ఫాస్టర్ లకు కేక్ ల అందచేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రేమ, సేవ, త్యాగం, క్షమ, కరుణ వంటి అత్యుత్తమ జీవన మార్గాలను మానవ జాతికి అందించి, ఇతరుల కోసం జీవించడం అనే గొప్ప సందేశాన్ని నేర్పిన క్రీస్తు జన్మదినం ఎంతో పవిత్రమైనదన్నారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని అవి అందరికీ ఆచరణీయమని ఎంపి పేర్కొన్నారు.

