🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్:
విద్యుత్ పొదుపుపై విద్యార్థి స్థాయి నుండే అవగాహన కలిగించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ చెప్పారు. ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తముగా విద్యుత్ పొదుపుపై పాఠశాల మరియు కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విజేతలకు స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జాయింట్ కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. విద్యుత్, ఇంధన పొదుపుపై జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు.
కార్యక్రమములో పి.సాల్మన్ రాజు, పర్యవేక్షక ఇంజనీర్, టి.శశిధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టెక్నికల్, టి.రాజ్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏ.సంజయ్ కుమార్ మరియు ఇ.రాంబాబు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు విద్యుత్ సంస్థ అధికారులు పాల్గొన్నారు.

