🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మరికొందరు ఎన్డిఏ ఎంపీలతో కలిసి కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో ఆమె నివాసంలో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో మహిళా సాధికారత, మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలు, అమలు అవుతున్న తీరు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Discussion on Women’s Empowerment – Eluru MP Participates
Eluru MP Putta Mahesh Kumar, along with BJP National President and Union Health Minister JP Nadda and other NDA MPs, met with Union Minister for Women and Child Development Annapurna Devi at her residence on Wednesday evening.
According to a statement from the MP’s office, the meeting included discussions on women’s empowerment, existing laws for women’s protection, their implementation, and other related issues.

