The Desk…Eluru : ‎పన్ను చెల్లించని క్రిఫ్టో కరెన్సీ సంస్థలపై చర్యలు.. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

The Desk…Eluru : ‎పన్ను చెల్లించని క్రిఫ్టో కరెన్సీ సంస్థలపై చర్యలు.. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ‎ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

ఆదాయపు పన్ను చట్టం కింద నిబంధనలను పాటించని ఆఫ్ షోర్ క్రిఫ్టో కరెన్సీ ఎక్స్చేంజిలపై చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు. ఈమేరకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

మనీ లాండరింగ్ కార్యకలాపాలు, మరియు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే సంస్థల నియంత్రణకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నేతృత్వంలో వర్చువల్ అసెట్స్ సర్వీస్ ప్రొవైడర్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఆదాయపన్ను చట్టం 1961 సెక్షన్ 133A కింద 3 క్రిఫ్టో ఎక్చేంజిలపై దాడులు చేయగా, నిబంధనలు పాటించని 39.8 కోట్ల విలువైన లావాదేవీలు, 125.79 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆదాయం బయటపడ్డాయని మంత్రి సమాధానం ఇచ్చారు.

ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 133A కింద గత మూడేళ్లలో అనేక క్రిఫ్టో ఎక్చేంజి సంస్థలపై సర్వే చేపట్టగా వర్చువల్ డిజిటల్ ఆస్తులకు చెందిన లెక్కల్లో చూపని 888.82 కోట్ల ఆదాయం బయటపడిందని వెల్లడించారు.

క్రిఫ్టో సంస్థల నుంచి వసూలు చేసిన పన్నులకు సంబంధించి రాష్ట్రాల వారీగా వివరాలు కోరుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ.. క్రిఫ్టో ఎక్చేంజిల నుంచి 2024- 25 ఏడాదికి వసూలు చేసిన ఆదాయపన్ను లెక్కల ప్రకారం 293.40 కోట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 133.94 కోట్లతో గుజరాత్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. క్రిఫ్టో ఎక్చేంజిలు తక్కువగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ 12 లక్షల పన్ను వసూళ్లతో 10వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.