The Desk…Eluru : ‎సీఎం రమేష్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పరామర్శ

The Desk…Eluru : ‎సీఎం రమేష్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పరామర్శ

🔴 ‎ఏలూరు/కడప : ది డెస్క్ :

అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ను ఈరోజు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పరామర్శించారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామంలో సీఎం రమేష్ మాతృమూర్తి కొద్ది రోజుల క్రితం మరణించగా, ఇవాళ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పరామర్శించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రమేష్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల నిమిత్తం ఢిల్లీ లో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు పలువురు ఎంపీలు ఈరోజు తమ సహచర ఎంపీ సీఎం రమేష్ ను పరామర్శించేందుకు ప్రత్యేకంగా కడప వచ్చారు. వీరిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్, గత లోక్ సభలో ఎంపీగా ఉండి ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పర్వేష్ వర్మ, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఇతర లోక్ సభ ఎంపీలు, పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తదితరులు ఉన్నారు.