- సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో మొబైల్ టవర్ల అంశం.
- సిగ్నల్ సమస్యలతో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు.
- బిఎస్ఎన్ఎల్ కొత్త టవర్లు త్వరగా ఏర్పాటు చేయాలి.
ఏలూరు జిల్లా : ది డెస్క్ :
కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి వ్యవహారాలను పర్యవేక్షించడంలో మంత్రి పెమ్మసాని చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా అభినందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బిఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్ల ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరారు.
ఏలూరు పార్లమెంట్ పరిధిలో మొబైల్ సిగ్నల్ సమస్యలపై సీరియస్ గా దృష్టి సారించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇటీవల బిఎస్ఎన్ఎల్ అధికారులతో ఏలూరులో సమావేశం ఏర్పాటు చేసి కొత్త టవర్ల ఏర్పాటు అంశాన్ని సమీక్షించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా శుక్రవారం ఢిల్లీ లో కేంద్రమంత్రిని కలిసి మొబైల్ టవర్ల ఏర్పాటుకు ఒత్తిడి తీసుకువచ్చారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పెమ్మసాని వీలైనంత త్వరలో మొబైల్ టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీ కృషితో తొందరలోనే ఏలూరు పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.

