The Desk…Eluru : రాష్ట్రానికి 9. 71 లక్షల పిఎంయువై ఎల్పిజీ కనెక్షన్లు – ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి సమాధానం

The Desk…Eluru : రాష్ట్రానికి 9. 71 లక్షల పిఎంయువై ఎల్పిజీ కనెక్షన్లు – ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి సమాధానం

🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

ప్రధానమంత్రి ఉజ్వలఉజ్వల యోజన (పిఎంయువై) పథకం కింద గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 9.71 లక్షల ఎల్పిజీ కనెక్షన్లు ఇవ్వగా, ఇందులో ఏలూరు జిల్లాలో 23,719 పీఎంయువై కనెక్షన్లు ఉచితంగా ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు.

పీఎంయువై పథకం అమలు తీరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఇచ్చిన ఉచిత గ్యాస్ కనెక్షన్ల వివరాలు కోరుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సురేష్ గోపి సమాధానం ఇచ్చారు.

పేద కుటుంబాలలోని మహిళలకు డిపాజిట్ లేకుండా ఎల్పిజి కనెక్షన్ అందించాలనే లక్ష్యంతో 2016లో ప్రారంభమైన పిఎంయువై పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 2025 నవంబర్ నాటికి మొత్తం 10.33 కోట్ల ఎల్పిజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. వచ్చే 2025- 26 ఆర్ధిక సంవత్సరంలో మరో 25 లక్షల పీఎంయువై గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి సురేష్ గోపి తెలియచేశారు.