🔴 ఏలూరు జిల్లా : ది డెస్క్ :

పవిత్ర వివాహ బంధంతో ఒకటైన నూతన వధూవరులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. టి.నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, సుజాత దంపతుల కుమారుడు సాయి వినయ్ వివాహము, పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామానికి చెందిన కట్టుబోయిన కృష్ణమోహన్, కృష్ణకుమారి దంపతుల కుమార్తె భాగ్యశ్రీ తో గురువారం రాత్రి వీరభద్రవరం గ్రామంలో వైభవంగా జరిగింది.

ఈ వివాహానికి హాజరైన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నూతన వధూవరులను ఆశీర్వదించి, “మహేష్ అన్న పెళ్లికానుక” బహుమతులను అందజేశారు.

