The Desk… Eluru : జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

The Desk… Eluru : జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

స్థానిక ఏఎస్ఆర్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. అండర్ 10, 12, 14, 16, 18 ,20 విభాగాల్లో రన్నింగ్, జావలిన్ త్రో , హైజంప్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో) బాల, బాలికల ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహించారు.

జిల్లా నలుమూలల నుంచి 420 మంది హాజరయ్యారు.

సంఘం జిల్లా అధ్యక్షుడు గుళ్లా ప్రసాదరావు, కార్యదర్శి దేవరపల్లి దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో ఆయా క్రీడలకు సంబంధించి 110 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు.

అక్టోబరు 4 నుంచి 6 వరకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న రాష్ట్ర పోటీల్లో ఏలూరు జిల్లా తరఫున పాల్గొంటారు.