- విశాఖ CII సదస్సు సూపర్ హిట్.
- చంద్రబాబు గారిపై నమ్మకంతో వస్తున్న పారిశ్రామికవేత్తలు.
- 13.25 లక్షల కోట్ల పెట్టుబడులతో రికార్డు.
- భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు.
- ఏలూరుకు పరిశ్రమల రాకతో జిల్లాలో అభివృద్ధి పరుగులు.
🔴 ఏలూరు జిల్లా: ఏలూరు ఎంపీ క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :
రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పేరే ఒక బ్రాండ్ అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులుతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎంపీ.. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకం, ఐటీ పరిశ్రమల మంత్రి నారా లోకేష్ కృషితోనే విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 13.25 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదిరాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు దేశంలోనే మెరుగైన గమ్య స్థానాల్లో ఒకటిగా ఏపీ నిలబడుతోందన్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్ల హైదరాబాద్ ఏవిధంగా అభివృద్ధి చెందిందో అందరం చూశామని, అదేవిధంగా ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్ళేందుకు చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిశ్రమలు తీసుకువస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 18 నెలల కాలంలో మొత్తంగా 23 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడం సామాన్యమైన విషయం కాదని, రిలయన్స్, మిట్టల్, గూగుల్, బ్రూక్ ఫీల్డ్ వంటి ఎన్నో ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఈరోజు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు.
దేశానికి గ్రోత్ ఇంజన్ గా ఏపీ నిలవబోతోందన్నారు ఏలూరు ఎంపీ. అలాగే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ఐదు పరిశ్రమలకు శంకుస్థాపన జరగ్గా, రాబోవు రోజుల్లో మరో నాలుగు పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే తాను పరిశ్రమలు, ఉపాధిపై దృష్టి పెట్టానన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
విశాఖ భాగస్వామ్య సదస్సులో వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యుత్తు, విమానయాన, ఇతర రంగాల్లో దాదాపు 13.25 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటి వల్ల 14 లక్షల పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వటానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఇదే వేగం కొనసాగితే అతికొద్ది కాలంలోనే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందనటంలో సందేహం లేదు. ఉద్యోగాల కోసం మన యువత ఇతర దేశాలకు వెళ్ళటం కాదని, ఇతర దేశాల నుంచి ఏపీకి ఉద్యోగాల కోసం వచ్చే పరిస్థితి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క MOU కుదిరిన దాఖలాలుగానీ, ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలుగానీ లేవన్నారు. మంత్రి నారా లోకేష్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చారని, వేగంగా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం, రియల్ టైం అనుమతులు, ప్రోత్సాహకాలతో ఇన్వెస్టర్లకు భరోసా ఇస్తుండటంతో పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు.
రాష్ట్రంతో పాటు, ఏలూరు జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు, కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

