The Desk…Eluru : ‎విశాఖ సదస్సు బంపర్ హిట్ : ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : ‎విశాఖ సదస్సు బంపర్ హిట్ : ఎంపీ పుట్టా మహేష్

  • ‎కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో క్యూ కడుతున్న పరిశ్రమలు
  • 20 లక్షల కోట్ల పెట్టుబడులతో రికార్డు
  • భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు
  • ‎చంద్రబాబు నాయుడు పేరే ఒక బ్రాండ్
  • స్వర్ణాంధ్ర సాకారం దిశగా తొలి అడుగు‎➖(MP) మహేష్ పుట్టా

🔴 ‎ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 13 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదరటం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ..  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వల్ల ఈరోజు పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు మెరుగైన గమ్య స్థానాల్లో ఒకటిగా  ఏపీ నిలబడుతోందన్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్ల హైదరాబాద్ దేశంలోనే మెరుగైన ఐటీ హబ్ గా తయారైందని, రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత  ఆ కష్టమంతా తెలంగాణకు వెళ్లిపోవడంతో 2014లో  మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టవలసి వచ్చిందన్నారు.

మధ్యలో 5 ఏళ్ళు వైసీపీ  ప్రభుత్వం చేసిన విధ్వంసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ విజనరీ లీడర్  చంద్రబాబుకి తోడు యువనేత ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ఎంతో కష్టపడి పారిశ్రామికవేత్తలను ఒప్పించి పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతున్నారు.

‎ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్ళేందుకు మూడు దశాబ్దాల క్రితం ఎలా పనిచేశారో ఇప్పటికీ అదే ఉత్సాహంతో చంద్రబాబు  పనిచేస్తున్నారన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. కేవలం 18 నెలల కాలంలో మొత్తంగా 23 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడం సామాన్యమైన విషయం కాదని, రిలయన్స్, మిట్టల్,  గూగుల్,  బ్రూక్ ఫీల్డ్ వంటి ఎన్నో ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఈరోజు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు.  దేశానికి గ్రోత్ ఇంజన్ గా ఏపీ నిలవబోతోందన్నారు ఏలూరు ఎంపీ.

విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు వైసిపి ప్రభుత్వ హయాం నాటి వడియాలు పచ్చళ్ళు వంటి ఉత్తుత్తి ఒప్పందాలు, కోడిగుడ్డు ఒప్పందాలు కాదని ఆరు నెలలలోగా పరిశ్రమలు స్థాపించాలనే స్పష్టమైన నిబంధనలతో పేరుమోసిన పెద్ద సంస్థలతో చేసుకున్న అవగాహన ఒప్పందాలని ఎంపీ స్పష్టం చేశారు.

డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలతో రాయలసీమ ముఖచిత్రం కూడా మారబోతోందని, ఇది అభివృద్ధి వికేంద్రీకరణ పట్ల  కూటమి ప్రభుత్వానికి కల చిత్తశుద్ధిని  తెలియజేస్తుందన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యుత్తు, విమానయాన, ఇతర రంగాల్లో దాదాపు 13 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి.

వీటి వల్ల 14 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వటానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇదే వేగం కొనసాగితే అతికొద్ది కాలంలోనే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్  నిలుస్తుందనటంలో సందేహం లేదు.

ఉద్యోగాల కోసం మన యువత ఇతర దేశాలకు వెళ్ళటం కాదని, ఇతర దేశాల నుంచి ఏపీకి ఉద్యోగాల కోసం వచ్చే పరిస్థితి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. 
‎రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, మంత్రి నారా లోకేష్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చారన్నారు.

అలాగే, వేగంగా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం, రియల్ టైం అనుమతులు, ప్రోత్సాహకాలతో ఇన్వెస్టర్లకు భరోసా ఇస్తుండటంతో పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు.  ప్రధానమంత్రి మోదీ మేక్ ఇన్ ఇండియా, చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా విశాఖ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ కావడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు.

ఇందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు, కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.