🔴 BE WARE : ఏలూరు జిల్లా : THE DESK :
ఈమధ్య ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్, వాట్సాప్ వీటిలో పబ్లిక్ గా అందుబాటులో ఉన్న ఫొటోస్ ను, వీడియోస్ ను మార్ఫింగ్ చేసి, డీ ఫేక్ చేయడం ద్వారా రకరకాల మోసాలు జరుగుతున్నాయి.
అందులో భాగంగా ప్రభుత్వ అధికారులు- జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు..
ఇలాంటి వారి ప్రముఖుల ఫొటోస్ పెట్టుకుని వాట్సప్ లో నిధులు సేకరించడం కావచ్చు.. రకరకాల మెసేజ్ చేయడం ప్రజలను మోసం చేయడం జరుగుతుంది.
ప్రజలకు విజ్ఞప్తి :
ఇలాంటివారు ఎవరు కూడా ఫోటోలు పెట్టి డబ్బులు అడగడం కానీ సహాయం చేయమనడం కోరడం కానీ ఇలాంటివి జరగవు
ఈ రకంగా ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడగడం గానీ ప్రలోభాలకు గురిచేసి మిమ్మల్ని మోసం చేయడానికి గురి చేసే ప్రయత్నాలను గుర్తుపెట్టుకుని అలాంటి మోసగాళ్ల బారిన పడవద్దు.
అట్లాంటి మోసాలు ఏమైనా మీ దృష్టికి వస్తే పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వండి..
ప్రతాప్ శివకిషోర్ (ఏలూరు జిల్లా ఎస్పీ)