The Desk…Eluru : దోషులకు శిక్ష తప్పదు.. ఢిల్లీ పేలుళ్ల ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి

The Desk…Eluru : దోషులకు శిక్ష తప్పదు.. ఢిల్లీ పేలుళ్ల ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి

🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ.. ఢిల్లీ పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.

ఈ దుర్ఘటనలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు ఉగ్రవాదులైనా, మరెవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదని, ప్రజలెవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.

ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడతామని ప్రధాని మోదీ ఇప్పటికే చెప్పారని, కారు బాంబు పేలుళ్ల కారకులకోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయని, త్వరలోనే నేరస్థులను పట్టుకోవడం జరుగుతుందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన ప్రకటనలో వెల్లడించారు.