The Desk…Eluru : ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల జారీ – పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో హర్షం.

The Desk…Eluru : ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల జారీ – పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో హర్షం.

  • ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు బదిలీ సమస్యకు పరిష్కారం.
  • కొత్త చిరునామాలతో జాబ్ కార్డులు జారీతో పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో సంతోషం.
  • ఉపాధి” కల్పించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు నిర్వాసితుల ధన్యవాదాలు.

🔴 ఏలూరు : ది డెస్క్ :

పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపు మండలాల నుంచి పునరావాసం కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి ఫలితంగా పునరావాస కాలనీలకు మారిన కుటుంబాలకు కొత్త చిరునామాలతో జాబ్ కార్డులు అందించారు.

‎పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇటీవల జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో పర్యటించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వద్ద పలువురు నిర్వాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పాత గ్రామాల్లో తమకు ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నప్పటికీ, కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలకు అవి బదిలీ జరగకపోవడంతో పనులు దొరకక తాము పడుతున్న ఇబ్బందులు వివరించారు.

‎తక్షణం స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ జిల్లా పరిషత్ సీఈవోతో పాటు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్వాసితులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకే జాబ్ కార్డులు మంజూరు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆధికారులకు చెప్పటమే కాకుండా, సమస్య పరిష్కారం అయ్యేవరకూ నిరంతరం పట్టువదలని విక్రమార్కుడులా కృషి చేయడంతో జాబ్ కార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పునరావాస కాలనీల్లో ఉంటున్న ఉపాధి హామీ కార్మికులకు తాజాగా కొత్త చిరునామాలతో అధికారులు జాబ్ కార్డులు అందించారు.

ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల విషయంలోగానీ, పరిహారం విషయంలోగానీ, పునరావాస సౌకర్యాల విషయంలోగానీ, తమ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, తమకు న్యాయం చేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఈ సందర్భంగా నిర్వాసిత కాలనీల్లో ఉంటున్న కుటుంబాలవారు కృతజ్ఞతలు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుకోసం సొంత ఊళ్ళు వదిలి, కొత్తగా నిర్మించిన కాలనీలకు వచ్చిన తాము, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు కొత్త చిరునామాకు మారకపోవడంతో పనులు చేసుకోలేక, ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషితో ఇప్పుడు కొత్త జాబ్ కార్డులు వచ్చాయని, ఎంపీ మేలు మర్చిపోలేమని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు.