The Desk… Eluru : జిల్లా వ్యాప్తంగా ‘స్వచ్ఛతా హీ సేవ’ : డీపీవో

The Desk… Eluru : జిల్లా వ్యాప్తంగా ‘స్వచ్ఛతా హీ సేవ’ : డీపీవో

ఏలూరు జిల్లా : ఏలూరు: THE DESK :

జిల్లాలో అన్ని గ్రామాల్లో మంగళవారం నుంచి అక్టోబరు 1 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు.

ఆయన మంగళవార మిక్కడ మాట్లాడుతూ… డీపీవో కార్యాలయం నుంచే పరిశు భ్రత డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

పదిహేను రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా రోజుకో కార్యక్రమం ఉంటుందన్నారు. వాటిని అధికారులు తప్పనిసరిగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

చివరి రోజున పారిశుద్ధ్య కార్మికులను సన్మానించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.