విద్యాసంస్థల బస్సులోని భద్రతా లోపాలను తక్షణం సవరించకపోతే కఠిన చర్యలు తప్పవని విద్య సంస్థల యాజమాన్యాలను ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ హెచ్చరించారు. పట్టణంలోని విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు మరియు ప్రతినిధులతో కరీమ్ చొదిమెళ్లలోని వారి కార్యాలయములో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భముగా DTC కరీం మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్ కమిషనరు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న అన్ని విద్యాసంస్థల బస్సుల్లో ఉన్న అన్ని భద్రతా లోపాలను ఈ నెల10 వ తేదీ లోగా సవరించుకోవాలన్నారు, తదనంతరమే విద్యార్థులను తరలించాలని కరీమ్ అన్నారు. బస్సుల్లో సవరించుకోవాల్సిన భద్రతా లోపల నోటీసులను వారికి అందించారు.
ఈ నెల 11 వ తేదీ నుంచి వాహన తనిఖీ అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో ప్రతి యొక్క పాఠశాల మరియు కళాశాల బస్సులను క్షుణ్ణముగా తనిఖీ చేస్తారన్నారు. తనిఖీలో భద్రతా లోపాలు బయట పడితే సీజ్ చేయడముతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 185G ఎపి ఎంవిఐ రూల్ ప్రకారం నిబంధనలను ఖచ్చితముగా పాటించాలన్నారు.

