The Desk…Eluru : ఘనంగా మడుపల్లి మోహన గుప్తా 81 వ జన్మదిన వేడుకలు

The Desk…Eluru : ఘనంగా మడుపల్లి మోహన గుప్తా 81 వ జన్మదిన వేడుకలు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం 2025 లో శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అవార్డుకు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన పి. సత్యవతిని ఎంపిక చేసినట్లు గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్త తెలిపారు.

ఈ సందర్భంగా మోహన్ గుప్తా మాట్లాడుతూ…

పేదలకు ఆర్థికంగా నగదుతో పాటు ఆరోగ్య సంబంధిత విషయంలోనూ బాధ్యతగా ఫౌండేషన్ సేవలందిస్తుందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ లో డయాలసిస్ పేషెంట్లకు సేవలు అందించేందుకు 15 లక్షల రూపాయలు విరాళం ఇచ్చామని, నగరంలో వివిధ ప్రాంతాల్లో వందలాదిమంది నిరుపేద కుటుంబాలకు ఎన్నో సహాయ సేవలు అందించినట్లు, ఏలూరు నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద తల సేమియా బ్లాక్ నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు, 15 మంది నిరుపేదలకు, నిరుపేద విద్యార్థులకు ఇంజనీరింగ్ చదివేందుకు ఆర్థిక సహాయం కింద ₹2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం, ద్వారకా తిరుమలలో ఉన్న హాస్పిటల్ కి వికలాంగుల సహాయార్థం 2025 సంవత్సరంలో వికలాంగులకు 8 లక్షల 69 వేల రూపాయలు అందజేశామన్నారు.

శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత సత్యవతి

శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అవార్డుకు ఎంపికైన పి సత్యవతికి అవార్డుతోపాటు 3 లక్షల రూపాయలు నగదు పురస్కారం కూడా అందజేస్తున్నట్లు గుప్తా ఫౌండేషన్ అధినేత మోహన్ గుప్తా తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మడిపల్లి మోహన్ గుప్తాకు 81వ పుట్టినరోజు వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏలూరు మండలంలోని శ్రీపర్రు గ్రామంలో ఉన్న తమ స్థలంలో గ్రామస్తుల కోసం కళ్యాణ మండపం నిర్మించేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని శ్రీపర్రు గ్రామస్తులకు హామీ ఇచ్చారు.