The Desk…Eluru : ఎంపీ చొరవతో కదిలిన రైల్వే శాఖ.. ఆర్వోబీల కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ.‎.

The Desk…Eluru : ఎంపీ చొరవతో కదిలిన రైల్వే శాఖ.. ఆర్వోబీల కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ.‎.

  • ‎కైకరం, దెందులూరు ఆర్వోబీలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ.‎
  • త్వరలోనే మరికొన్ని నోటిఫికేషన్లు.
  • రైల్వే గేట్ల వద్ద తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

ఏలూరు పార్లమెంట్ పరిధిలో పలు రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్రంతో మాట్లాడి ఇటీవల 13 ఆర్వోబీలు మంజూరు చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా ‎ఉంగుటూరు మండలం కైకరం, దెందులూరు మండలం కొత్తగూడెంలలో ఆర్వోబీ (రోడ్డు ఓవర్ బ్రిడ్జి)ల నిర్మాణం కోసం భూసేకరణకు రైల్వే శాఖ ప్రిలిమినరీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కైకరం ఎల్సీ నెంబర్ 364 వద్ద 19 సర్వే నెంబర్లలో 6.875 ఎకరాలు, కొత్తగూడెం ఎల్సీ నెంబర్ 355 వద్ద 18 సర్వే నెంబర్లలో 5.314 ఎకరాల భూమి సేకరణ కోసం ప్రకటన జారీ అయింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత భూయజమానులు 30 రోజుల్లో తెలియజేయాలని రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఆర్వోబీల కోసం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైల్వే అధికారులను, కేంద్ర రైల్వే మంత్రిని కలిసి అనుమతులు సాధించడమే కాకుండా, భూ సమస్యలు ఉన్న చోట రైల్వే, నేషనల్ హైవే అధారిటీ, రెవెన్యూ అధికారులను తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంతో ఆర్వోబీల నిర్మాణానికి ముందడుగు పడింది. జిల్లాలో ఎంతోకాలంగా రైల్వే గేట్ ల వద్ద ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతూ వంతెనల నిర్మాణ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే.