🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
మొంథా తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ సూచించారు.
ఇదేఅంశంపై అమరావతి నుండి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో నేరుగా ఫోన్లో మాట్లాడిన మంత్రి లోకేష్..తాజా పరిస్థితులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటికి ఆయన పలు కీలక సూచనలు చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంలో మరింత చోరవ చూపాలంటూ సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గేంతవరకూ తాను రాష్ట్ర కంట్రోల్ రూమ్‌లో అందుబాటులోనే ఉంటానని తనను సంప్రదించవచ్చని లోకేష్ అన్నారు.
ఇదేసమయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తుఫాన్ సవాళ్ళను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలను మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్యే చంటి వివరించారు.

