- మొబైల్ ఫోన్ల వాడకంతో పిల్లల్లో కంటి సమస్యలు..
- చిన్నారులను స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే..
సానా సతీష్ బాబు ఫౌండేషన్ సేవలు అభినందననీయం. ➖ ఏలూరు MP
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత పిల్లలలో కంటి సమస్యలు పెరిగాయన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు నగరంలోని ఈదర సుబ్బమ్మదేవి ప్రభుత్వ పాఠశాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు, కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..
చిన్నప్పటి నుంచే అందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. విద్యార్ధులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షల నిర్వహించి సమస్యలు ఉన్నవారికి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేపట్టిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ కు అభినందనలు తెలుపుతున్నానన్నారు. డబ్బు, అధికారం ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలు చేయటం అందరివల్లా కాదు, దానికి ఎంతో పెద్ద మనసు ఉండాలన్నారు. ఈ పాఠశాలల్లోని పిల్లలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
మొబైల్ ఫోన్ల వాడకంతో పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, దీనిపై విద్యార్దులు వారి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

