🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం :ది డెస్క్ :
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపిజె అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఏలూరు శాంతినగర్ లో ఉన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ సందేశం ఇస్తూ.. కలలు కనండి, ఆ కలలు సాకారం అయ్యేవరకూ పట్టువదలకుండా ప్రయత్నించండి అంటూ యువతలో స్ఫూర్తి నింపిన మహనీయుడు అబ్దుల్ కలాం అన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని, తమిళనాడులోని రామేశ్వరం లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి కృషితో పట్టుదలతో అత్యున్నత శిఖరాలకు ఎదిగిన అబ్దుల్ కలాం గారిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
అబ్దుల్ కలాం స్ఫూర్తితో రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే దిశగా యువనేత నారా లోకేష్ నాయకత్వంలో సంస్కరణలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కార్యాలయ సిబ్బంది, పలువురు పార్టీ నేతలు పాల్గొని కలాం చిత్రపటానికి నివాళి అర్పించారు.