The Desk…Eluru : ఆశ్రం హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్యర్ అవగాహాన సదస్సు

The Desk…Eluru : ఆశ్రం హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్యర్ అవగాహాన సదస్సు

  • అవగాహన – అప్రమత్తతే ఆయుధం

➖ డా॥ పి.జె. అమృతం. (జిల్లా వైద్య అధికారిణి)

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఆశ్రం క్యాన్సర్ కేర్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య అధికారిణి డా|| పి.జె. అమృతం ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భముగా డాక్టర్ పి.జే అమృతం మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా ప్రభలుతోందని, అవగాహన లేక పోవడం వలన చాలా మంది స్త్రీలు ఇబ్బందులు పడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేసారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు అవగాహనా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలలో చైతన్యం కల్పిస్తున్నామని, అవగాహనే ఆయుధమని తెలియజేసారు.

ఆశ్రం హాస్పిటల్స్, సి.ఇ.ఒ.డా॥ కె. హనుమంతరావు మాట్లాడుతూ… ఆశ్రం క్యాన్సర్ కేర్ ద్వారా ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ఆశ్రం క్యాన్సర్ కేర్ తరపున ప్రాధమిక స్థాయిలో క్యాన్సర్ను గుర్తించేందుకు స్క్రీనింగ్ శిబిరాలను, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేసారు. గ్రామీణ స్థాయిలో నిర్వహించే శిబిరాలలో పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమగు వారికి క్యాన్సర్ చికిత్సలను ఉచితముగా, ప్రత్యేక రాయితీలతోనూ చేస్తున్నామని తెలియజేసారు.

ఆశ్రం క్యాన్సర్ కేర్ ద్వారా రొమ్ము క్యాన్సర్ చికిత్స పొందిన జి. లలిత మాట్లాడుతూ… ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వలన క్యాన్సర్ పై పోరాడి విజయం సాధించామని తెలియజేసారు.

బి.వెంకట లక్ష్మి మాట్లాడుతూ.. రొమ్ములో ఇబ్బందిని ముందుగా గుర్తించనప్పుటికి, అవగాహన లేక, భయం వలన సరైన సమయంలో చికిత్స తీసుకోలేకపోయానని, కాని కుటుంబ సభ్యుల సహకారంతో ఆశ్రం కాన్సర్ కేర్ చికిత్స తరువాత కొలుకున్నానని, నాలా ఎవరూ ఇబ్బంది పడకుండా, ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజిస్ట్లు డా|| సింధు, డా॥ సారధి, సర్జికల్ ఆంకాలజిస్ట్ డా॥ శైలజ, డా॥ చంద్ర శేఖర్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా|| కణ్మణి, డా॥ మౌనిక, డా|| ధాత్రి, ఆశ్రం మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా॥ చేబ్రోలు శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డా॥ ఎస్. వేణుగోపాల్ రాజు,, మెడికల్ సూపరింటిండెంట్ డా॥ శాంతయ్య, డిప్యూటి మెడికల్ సూపరింటెండెంట్ డా॥ పి. హారీష్ గౌతమ్, గ్రూప్ సి.ఒ.ఒ. రాజరాజన్, ఇతర వైద్యలు సిబ్బంది, వైద్య విద్యార్ధులు పాల్గోన్నారు.