- సామాన్యులకు అందుబాటులో ధరలు…వినియోగదారుల హర్షం
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్:
ఏలూరు నగరంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాణసంచా విక్రయ కేంద్రం ప్రజలకు ఆకర్షణగా మారింది.
అందుబాటులో ధరలతో నాణ్యమైన బాణసంచా అందుబాటులో ఉండటంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వట్లూరు వద్ద ఉన్న డీసీఎంఎస్ బాణసంచా విక్రయ కేంద్రాన్ని ఏలూరు ది డెస్క్ జాతీయ పత్రిక ప్రతినిధి సందర్శించి, అక్కడ కొనుగోలు చేస్తున్న వినియోగదారుల అభిప్రాయాలను సేకరించారు.
ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి బాణసంచా కొనుగోలు చేస్తున్నారు.వినియోగదారుల అభిప్రాయం ప్రకారం, ఈ కేంద్రంలో ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటంతో పాటు వివిధ రకాల బాణసంచా లభ్యత సంతోషకరమని తెలిపారు.
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఇక్కడ నుంచే కొనుగోలు చేయడం తమ సంప్రదాయంగా మారిందని పలువురు పేర్కొన్నారు.ఈ సందర్భంగా వినియోగదారులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.