- – రాష్ట్ర ఐటీ అభివృద్ధిలో గూగుల్ పెట్టుబడి ఒక గేమ్ చేంజర్.
- – మొన్న క్వాంటం వ్యాలీ, నేడు గూగుల్ ఏఐ డేటా సెంటర్.
- – సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ కష్టం ఫలిస్తోంది.
🔴 ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్ గా మారనుందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య జరిగిన చారిత్రక ఒప్పందంపై హర్షం వ్యక్తం చేస్తూ ఏలూరు ఎంపీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఒప్పందంతో రాష్ట్ర ఐటీ పరిశ్రమ రూపు రేఖలు మారనున్నాయని , ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఐటీ సంస్థలను, పరిశ్రమలను తీసుకువచ్చి హైదరాబాద్ ను చంద్రబాబు నాయుడు ఏ విధంగా అభివృద్ధి చేశారో గతంలో చూశామని, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతోపాటు నారా లోకేష్ ప్రత్యేక దృష్టికి సారించడంతో అనేక సంస్థలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయన్నారు. వీరిద్దరి చొరవతో గత 16 నెలల్లోనే రాష్ట్రానికి 11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం జరిగిందని, ఇప్పుడు గూగుల్ డేటా కంపెనీలో రాకతో ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ, నైపుణ్య అవకాశాలు లభించబోతున్నాయన్నారు.
పరిశ్రమలు తీసుకురావడంతోపాటు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి వారు ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకునే విధంగా కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని, అంతేగాకుండా పాఠశాల స్థాయి నుంచి ఏఐ పాఠ్యాంశాలను స్కూల్ సిలబస్ లో చేర్చుతున్నామని ఎంపీ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సంస్థ రానున్న ఐదు ఏళ్లలో సుమారు 15 బిలియన్ డాలర్ పెట్టుబడి విశాఖలో పెట్టనుందన్నారు.
భారతదేశంలో ఈ కంపెనీకి ఇప్పటివరకు పెట్టిన అన్నిటికంటే ఇదే అతిపెద్ద పెట్టుబడి కాబోతోంది, ఇక్కడ నుంచి 12 దేశాలతో సబ్ సీ- కేబుల్ విధానం ద్వారా అనుసంధానం జరుగుతుందని, దీనితో విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా మారనుందని సంతోషం వ్యక్తం చేశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తూ, మొన్న అమరావతికి క్వాంటం వ్యాలీ, నేడు విశాఖపట్నంకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఐటీ పరిశ్రమల మంత్రి నారా లోకేష్ కి ఈ సందర్భంగా మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు ఏలూరు ఎంపీ మహేష్ కుమార్.