- గుండె జబ్బుతో బాధపడుతున్న నిరుపేద కుటుంబంలోని చిన్నారి
- సమస్య తన దృష్టికి రాగానే స్పందించిన ఎంపీ
- తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన ఎంపీకి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం.
- చిన్నారి తల్లిదండ్రులను ఫోన్ లో పరామర్శించిన ఎంపీ
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. గత నెల 27న జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా తమ 5 నెలల చిన్నారి శాన్వి రియాన్షిక ఆరోగ్య సమస్యను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.

పేద కుటుంబానికి చెందిన గొడ్ల ముత్యాలరావు, వినీత దంపతులు. గుండెలో రంధ్రం ఉన్న ఆ చిన్నారికి ఆపరేషన్ చేయాలని, అందుకు దాదాపు 4 లక్షలు ఖర్చు అవుతుందని, CMRF నుంచి ఎంపీ ద్వారానే 1.7 లక్షలు మంజూరు అయ్యాయని గుర్తుచేసిన బాలిక తల్లిదండ్రులు, మిగిలిన డబ్బులు లేక వైద్యం చేయించలేకపోతున్నామని కన్నీరు మున్నీరయ్యారు. చలించిన ఎంపీ అప్పటికప్పుడు స్థానిక ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు.
డబ్బుల సమస్య ఉంటే తాను చూసుకుంటానని, ఆ చిన్నారికి వెంటనే వైద్యం చేయాలని కోరటం జరిగింది. కేవలం 5నెలల వయసున్న బాలికకు ఆపరేషన్ విజయవాడలోనే సాధ్యం అవుతుందని స్థానిక ఆసుపత్రిలో చెప్పగా, చిన్నారిని విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల కిందట రమేష్ ఆసుపత్రిలో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేయగా సోమవారం చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
చిన్నారి శాన్వి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బాలిక తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు. చిన్నారి పూర్తిగా కోలుకున్న తర్వాత తాను స్వయంగా పరామర్శిస్తానని చెప్పిన ఎంపీ, మంచి చదువులు చదువుకుని బాలిక భవిష్యత్తులో డాక్టర్ గా కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని చెబుతూ, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బాలిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా చిన్నారి శాన్వి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఎంపీ మేలు ఈ జన్మలో మరిచిపోలేమని, తమ బాధను ఎంపీ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే, ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి సకాలంలో ఆపరేషన్ జరిగేట్లు చేసి, తమ బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు జీవితాంతం రుణపడి ఉంటామని, సొంత డబ్బులతో వైద్యం చేయించిన ఇటువంటి ఎంపీని ఎప్పుడూ చూడలేదని, ఇటువంటి ఎంపీ ఇక్కడ ఉండటం తమ అదృష్టం, ఏలూరు ప్రజల అదృష్టం అంటూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

