The Desk…Eluru :  మండవ వెంకటరామయ్యకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఘన నివాళులు

The Desk…Eluru : మండవ వెంకటరామయ్యకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఘన నివాళులు

🔴‎ ఏలూరు /హైదరాబాద్ : ది డెస్క్ :

‎గత నెల సెప్టెంబర్ 22న నిర్యాణం పొందిన నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) గ్రూప్ వ్యవస్థాపకుడు మండవ వెంకటరామయ్య సంస్మరణ సభ ఈరోజు ” సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్” పేరుతో హైదరాబాద్  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రధాన్ కన్వెన్షన్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి హాజరైన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మండవ వెంకటరామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతు బాంధవుడిగా అనేక అవార్డులు, ప్రశంసలు పొందిన మండవ వెంకటరామయ్య 1973లో నూజివీడు సీడ్స్ లిమిటెడ్ స్థాపించారు.

మండవ ఫౌండేషన్ ద్వారా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న వెంకటరామయ్య రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో కూడా  భాగస్వామి అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుమేరకు ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గంలోని తన స్వగ్రామం తుక్కులూరుతో పాటు ఆగిరిపల్లి గ్రామంలో పలు పేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు.

మండవ వెంకటరామయ్య నివాళి కార్యక్రమానికి హాజరైన ఎంపీ పుట్టా మహేష్ కుమార్  రైతులకు, వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రస్తుతం ఎన్ఎస్ఎల్ గ్రూప్ కు సీఎండీగా వ్యవహరిస్తున్న ఆయన పెద్ద కుమారుడు ప్రభాకరరావును ఎంపీ పరమార్శించారు.‎‎