- టార్గెట్ 5.10 కోట్లు – వసూళ్లు 5.80 కోట్లు
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
వాహన తనిఖీల విభాగంలో నూరు శాతం లక్ష్యాన్ని అధిగమించారు ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారులు.
వాహన తనిఖీల మీద నెలకు 85 లక్షల రూపాయల చొప్పున ఏప్రియల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు మాసాలకు 5.10 కోట్ల రూపాయలను ఏలూరు జిల్లాకు లక్ష్యముగా నిర్ణయించగా 5.80 కోట్ల రూపాయలను సాధించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. 8,821 కేసులు నమోదు చేయడం ద్వారా 114 శాతం లక్ష్యాన్ని సాదించగలిగామన్నారు.
ఇందులో ఫిట్నెస్ లేనందుకు 1,018 కేసులు నమోదు చేయడం ద్వారా రూ. 24,83,000/-, పర్మిట్ లేని లేనందుకు 374 కేసులు నమోదు చేయడం ద్వారా రూ. 36,36,300/-, పన్ను చెల్లించనందుకు 2,273 కేసులు నమోదు చేయడం ద్వారా రూ. 18,76,600/-, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు గాను 1,349 కేసులు నమోదు చేయడం ద్వారా రూ. 33,10,200/-, హెల్మెట్ ధరించనందుకు గాను 1,319 కేసులు నమోదు చేయడం ద్వారా 10,90,000/-, వాహన ఇన్సూరెన్స్ లేనందుకు గాను 1,357 కేసులు నమోదు చేయడం ద్వారా 27,48,000/-అపరాధ రుసుము విధించి నూటికి నూరు శాతమే కాకుండా.. అదనంగా 14 శాతం లక్ష్యాన్ని అధిగమించినట్లు కరీమ్ తెలిపారు.