ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
వాతావరణ శాఖ వర్షాలపై రెడ్ అలర్ట్
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి
పశు వైద్య, పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలి
— జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శనివారం రాత్రి మండల ప్రత్యేక అధికారులు జిల్లా అధికారులు తాసిల్దారులు తదితరులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరింత అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సెల్వి మాట్లాడుతూ.. రాబోయే 48 గంటలు అల్పపీడనం అవకాశం ఉన్నందున భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బుడమేరు, కొల్లేరు ప్రభావిత మండలాల్లో తాహసిల్దార్లు మరి తప్రమత్తంగా ఉండాలన్నారు. కైకలూరు, పెదపాడు, కలిదిండి, మండవల్లి, ఏలూరు రూరల్, నిడమర్రు మండలాల్లో తహసిల్దార్లు వీఆర్వోలు తమ హెడ్ క్వార్టర్ లోనే ఉండి ఎ సంఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారి దృష్టికి తీసుకురావాలన్నారు. ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించాలన్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడ రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కూలిపోయేందుకు అవకాశం ఉన్న ఇండ్లలో ఉంటున్న ప్రజలను తక్షణం ఖాళీ చేయించాలని వారికి ఇబ్బందులు రాకుండా ఉండేలా పునరావాసా కేంద్రాన్ని తక్షణం అందుబాటులోకి తేవాలనన్నారు. శనివారం రాత్రి అంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు కాలువలు పొంగి పొర్ల్లె అవకాశాలున్న చోట మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అటువంటి వాటిని ముందే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటలకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కొల్లేరు ప్రాంత పరిధిలో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, పశువులకు కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన పశుగ్రాసం సిద్ధం చేయాలని ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ ను ఆదేశించారు. రిలీఫ్ కేంద్రాలకు అవసరమైన కాయగూరలు తదితరులు ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ఏడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.అదేవిధంగాభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో ఇళ్లలోకి నీరు వచ్చే ప్రాంతాలను గుర్తించడంతో పాటు.. విద్యుత్ సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసకోవాలన్నారు. ఇవే కాకుండా.. గ్రామాలు, పట్టణాలలోని మంచి నీటి ట్యాంకులు కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.