🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

జిఎస్టి ప్రభావం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ స్లాబులను కుదించి 5%,12%, 18% లగ్జరీ వస్తువులపై పేదవారికి న్యాయం జరగాలని ఉద్దేశంతో నిత్యవసర వస్తువులపై మరియు టీవీ, ఫ్రిడ్జ్, ఏసి వస్తువులపై జిఎస్టి తగ్గించడం జరిగింది.
విజయదశమి సందర్భంగా ప్రతి షోరూంను సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా ప్రజల వద్ద నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాము.

చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, మోడీ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా జీఎస్టీని తగ్గించారో దానిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత నాయకులు కంటే ప్రజలదే అని..
స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రేట్లు తగ్గడం అనేది ఇదే మొట్టమొదటిసారని, దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలదే అని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేదే కూటమి ధ్యేయం కాబట్టి విజయదశమి సందర్భంగా ఇది నెరవేరినందుకు సంతోషంగా ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తెలిపారు.