🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
తమిళనాడు రాష్ట్రం కరూర్ లో టీవీకే పార్టీ ర్యాలీ సమయంలో తొక్కిసలాట జరిగి భారీగా ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, పరిస్థితులను పరిశీలించడానికి ఎన్డీఏ తరపున ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ బృందంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు చోటు కల్పించారు. బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన 8 మంది సభ్యుల ఈ ప్రతినిధి బృందంలో 6గురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరే ఇతర పార్టీల సభ్యులు. ఈ ఇద్దరిలో ఒకరు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే కాగా, రెండవ వ్యక్తి ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కావడం విశేషం.
బీజేపీ ఎంపీ హేమ మాలిని కన్వీనర్ గా, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో సహా మరో ఏడుగురు సభ్యులుగా ఏర్పాటు చేసిన ఈ బృందం ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలను కలిసి, కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తుంది.