🔴 అంతర్జాతీయo : టెక్సాస్/ఏలూరు : ది డెస్క్ :

టెక్సాస్ స్టేట్ లోజరిగిన సూపర్ స్టార్స్ ఛెస్ ఛాంపియన్ ట్రోఫీ పోటీలలో హోరాహోరీగా జరిగిన 5 రౌండ్ల లోనూ గెలిచి టెక్సాస్ స్టేట్ డల్లాస్ సిటీ ఫ్రిస్కోకు చెందిన తపన్ కుషల్ ప్రధముడుగా నిలచి సూపర్ స్టార్స్ ట్రోఫీ సాధించాడు.

తపన్ కుషల్ AP స్టేట్ – ఏలూరు యంపీ పుట్టా మహేశ్ కుమార్ కు PRO గా చేస్తున్న పులి శ్రీరాములుకు మనవడు కావడం విశేషం. 5 రౌండ్లలోనూ గెలిచిన తపన్ కుషల్ ను పలువురు అభినందించారు. గతంలో డల్లాస్ సిటీ స్థాయిలోనూ టెక్సాస్ స్టేట్ స్థాయిలోనూ జరిగిన ఛెస్ పోటీలలో తపన్ కుషల్ విజేతగా నిలిచాడు.