🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు నగరంలో విస్తరించి ఉన్న కృష్ణ కాలువ వెంబడి అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలని గత DRC సమావేశంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ కోరారు. కృష్ణ కాలువ గట్లపై నర్సరీ లు ఏర్పాటు చేయడం ద్వారా నగరం మరింత సుందరంగా కనిపిస్తుందని ఎమ్మెల్యే బడేటి సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థనపై జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సానుకూలంగా స్పందించారు. కృష్ణ కాలువ గట్లను సుందరీకరించే విషయంపై అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే లందరూ తగిన సూచనలు ఇచ్చారు.
కార్యక్రమంలో ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా మంత్రి పార్థసారథి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, చింతమనేని ప్రభాకర్, చిర్రీ బాలరాజు, సొంగా రోషన్ కుమార్ మరియు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.