The Desk…Eluru : ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పక్కా చర్యలు చేపట్టాలి ➖జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

The Desk…Eluru : ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పక్కా చర్యలు చేపట్టాలి ➖జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

  • విద్యుత్తు వాహనాలు ఉపయోగించేలా చర్యలు చేపడితే కాలుష్య నివారణకు కొంత ఊరట కలుగుతుంది
  • పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విస్తృతంగా తనిఖీలు జరపాలని, నాణ్యత లోపిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలి
  • కాలం చెల్లిన వాహనాలను గుర్తించి సీజ్ చేసి, ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలి

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :

ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పటిష్టమైన ప్రణాళిక అమలు చెయ్యాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం స్ధానిక కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన కాలుష్య నియంత్రణా మండలి, నగరపాలక సంస్ధ, రవాణా, పోలీసు, అటవీ, పరిశ్రమలు, తదితర అధికారులతో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్ సిపి) జిల్లాస్ధాయి అమలు కమిటీ సమావేశం జరిగింది.

సందర్భంగా కమిషనర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ.. ఏలూరు నగరపాలక సంస్థకు స్లీపింగు మిషన్, వేస్ట్ సపరేషన్ మిషన్ యన్ క్యాప్ నిధులతో కొనుగోలు చేసి, పూర్తిస్థాయిలో వాడుకలోకి తెచ్చామని నగరపాలక సంస్థ కమీషనరు జిల్లా కలెక్టరుకు వివరించారు.

సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ… ఏలూరు నగర వాసులకు స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణాన్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో వాయుకాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ముందస్తుగా కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసిన నిధులతో మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు.

నగరంలో 2024 -2025 పనులపై సుదీర్ఘంగా సమీక్షించి త్వరగా పూర్తిచేయాలని నగరపాలక సంస్ధ, పోలీసు శాఖలను జిల్లా కలెక్టరు ఆదేశించారు. క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం క్రింద నగరంలో చేపట్టబోయే పనులపై సమీక్షించారు. నగర ప్రజలకు స్వచ్చమైన గాలిని అందించేందుకు తీసుకోవలసిన చర్యలను సమావేశంలో చర్చించారు.

వాయుకాలుష్య స్ధాయి 20 నుండి 80 శాతం వరకు తగ్గించి గాలిలో నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంతో పాటు రూరల్ ప్రాంతాల్లో గల ప్రైవేటు బంకులను తనిఖీచేసి పెట్రోల్, డిజిల్ నాణ్యతను పరీక్షించాలని, నాణ్యత లోపిస్తే సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నగరపాలక సంస్థలో గ్రీన్ వాహనాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా బ్యాటరీ వాహనాలను ప్రజలకు అందుబాటులో రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గాలిలో దుమ్ము,ధూళి శాతాన్ని మిషన్ ద్వారా పరీక్షలు జరిపే డిజిటల్ డిస్ ప్లే అక్టోబరు 10వ తేదీ లోపుగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. కాలం చెల్లిన వాహనాలను గుర్తించి సీజ్ చేసి, వాహన ఆపరేటర్లుపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు సూచించారు.

సమావేశంలో ఆర్టీవో యం.అచ్యుత్ అంబరీష్, ప్రాంతీయ కాలుష్య నియంత్రణా మండలి ఇఇ కె.వెంకటేశ్వరరావు, నగర పాలక సంస్ధ కమీషనరు ఏ.భానుప్రతాప్, జిల్లా పరిశ్రమల అధికారి పి.సుబ్రహమణ్యేశ్వరరావు, జిల్లా రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి.శేఖర్, డియస్పి డి.శ్రావణ్ కుమార్, ఆర్ & బి శాఖ ఇఇ వై.వి.కిషోర్ బాబుజీ, డియస్ వో ఇ.బి.వి.విలియమ్స్, సిపిసిబి కన్సాల్టెంటు ఏ.కోమలి, రవాణా, పోలీసు, వ్యవసాయ, కాలుష్య నియంత్ర మండలి, పౌరసరఫరాలు, అటవీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.