The Desk…Eluru : ఏలూరులో ఎస్బిఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ కాన్ఫరెన్స్ ఘనంగా…

The Desk…Eluru : ఏలూరులో ఎస్బిఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ కాన్ఫరెన్స్ ఘనంగా…

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లో ఆదివారం ఎస్బిఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ కాన్ఫరెన్స్ విజయవంతంగా జరిగింది

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్బిఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ శేఖర్, జనరల్ సెక్రటరీ విశ్వనాథ్, సిఆర్ఎస్ రాజశేఖర్, డి.ఆర్‌.ఎస్. గుమ్మళ్ళ ప్రదీప్ కుమార్, జెడ్‌.ఎస్. వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చించిన నాయకులు, ఉద్యోగుల సంక్షేమానికి యూనియన్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. విధి నిర్వర్తనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించడంతో పాటు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా యూనియన్ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు. అనంతరం యూనియన్ నాయకులను ఘనంగా సత్కరించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.