The Desk…Eluru : ప్రభుత్వ ఆసుపత్రికి ఉపశమనం.. ఎంపీ చొరవతో సమకూరిన ఆధునిక వైద్య పరికరాలు

The Desk…Eluru : ప్రభుత్వ ఆసుపత్రికి ఉపశమనం.. ఎంపీ చొరవతో సమకూరిన ఆధునిక వైద్య పరికరాలు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :‎‎

అర కొర సౌకర్యాలు, వైద్య పరికరాల కొరతతో ఇబ్బంది పడుతున్న  ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి కొంత  స్వాంతన చేకూరనుంది.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చొరవతో రూ. 1కోటి  విలువైన వైద్య పరికరాలు సమకూరాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గెయిల్ ఇండియా ద్వారా కోటి రూపాయల విలువైన వైద్య పరికరాలు అందాయి. 

ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన అనస్థీషియా వర్క్ స్టేషన్ పరికరాలు, కార్డియోటోకోగ్రఫీ మెషిన్లు, కంప్యూటెడ్ రేడియోగ్రఫీ సిస్టమ్ (ఎక్స్‌రే క్యాసెట్ రీడర్), హెమటాలజీ అనలైజర్ (ఓపెన్ లూప్), హెమటాలజీ అనలైజర్ (ఓపెన్ లూప్), ICE లైన్డ్ రిఫ్రిజిరేటర్లు కోరుతూ ఈ ఏడాది మార్చిలో గెయిల్ ఇండియా కు ఆసుపత్రి సూపరింటెండెంట్ పేరుతో లేఖ రాశారు.

సీఎస్ఆర్ కింద నిధులు కేటాయించి ఈ వైద్య పరికరాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరడంతో గెయిల్ ఇండియా సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించింది.

తాజాగా శుక్రవారం రాత్రి వైద్య పరికరాలు ఆసుపత్రికి చేరాయి. వాటిని కొద్దిరోజుల్లోనే రోగులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆసుపత్రి వర్గాలు తెలియచేశాయి. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఆసుపత్రి అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని, భవిష్యత్తులో మరిన్ని వసతుల కల్పనకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.‎‎