The Desk…Eluru : పలు విద్యా సంస్థల బస్సులపై 11 కేసులు నమోదు

The Desk…Eluru : పలు విద్యా సంస్థల బస్సులపై 11 కేసులు నమోదు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు జిల్లా వ్యాప్తముగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు విద్యా సంస్థల బస్సులను తనిఖీలు చేయడం ద్వారా వివిధ ఉల్లంఘనలకు గాను 11 కేసులు నమోదు చేసి, 37 వేల 400 రూపాయలను అపరాధ రుసుముగా విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు.

అన్ని విద్యా సంస్థల బస్సులు ఫిట్నెస్ లేకుండా నడుపరాదని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు స్కూల్ బస్సులు నడుపరాదని, అటువంటివారిని యాజమాన్యాలు అనుమతించరాదని తెలియచేశారు.

విద్యార్థులను సురక్షితముగా తీసుకువెళ్లని డీటీసీ కరీమ్ కోరారు. రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించాలన్నారు. విద్యార్థులను తరలించే విషయములో నిబంధనలను పాటించని విద్యా సంస్థల బస్సులను మరియు ప్రైవేటు వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.